హైద్రాబాద్ నగరంలో దారుణం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బియెస్ మక్త హరీ గేట్‌లో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మృతి చెందిన తర్వాత.. భర్త భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.