ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యాపిల్లలకు విషమిచ్చి ఉరేసుకొని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే శతాబ్ది నగర్‌లో ఉంటున్న ప్రదీప్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం సేవించిన భర్త.. భార్య, ముగ్గురు పిల్లలకు విషమిచ్చాడు. అనంతరం తాను ఉరితాడు బిగించుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే భార్య, ఒక పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.