టాలీవుడ్ స్టార్ హీరోలతో జోడీ కట్టిన అందాల చందమామ కాజల్ అగర్వాల్ తల్లికాబోతుంది. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లు తెలియజేశారు.
కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్‌ను గౌతమ్ – కాజల్ జంట గోవాలో జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘2022లో నిన్నే చూస్తున్నాను’ అని కామెంట్‌తో పాటు ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని షేర్ చేశారు గౌతమ్. దీంతో కాజల్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని గౌతమ్ కన్‌ఫర్మ్ చేసినట్లు అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. తమ జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నందున తన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ జంట అక్టోబర్ 2020లో తన చిరకాల మిత్రుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను గతేడాది అక్టోబర్ 30న కాజల్ ముంబైలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమా షూటింగ్స్‌తో మరింత బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.
కాజల్.. ప్రస్తుతం సినిమాలు ఏవి చేయడం లేదు. . తెలుగులో ‘ఆచార్య’, హిందీలో ‘ఉమ’ చిత్రీకరణ కూడా పూర్తయింది. ప్రస్తుతం భర్తతో సమయాన్ని ఆస్వాదిస్తోంది.