telugu navyamedia
తెలంగాణ వార్తలు

యాదాద్రీశుడికి మంత్రి సత్యవతి నిలువుదోపిడీ..

తెలంగాణలోని యాదగిరిగుట్టపై వెలిసిన ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం ఉదయం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌య ఆర్చ‌కులు వారికి ప్రత్యేక స్వాగతం పలికి.. ఆశీర్వచనం చేశారు.

లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి తన ఒంటిపై ఉన్నబంగారు నగలను నిలువుదోపిడి ఇచ్చారు. రెండు చేతి గాజులు, రింగులు, మెడ గొలుసు ను లక్ష్మి నరసింహ స్వామికి నిలువుదోపిడీ ఇచ్చారు. మొత్తం స్వామివారికి 12 తులాల బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వామి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి తీర్థప్రసాదాలు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. దేవాలయ స్వర్ణతాపడం కోసం కేసీఆర్ పిలుపునందుకుని చాలామంది బంగారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే తాను ప్రస్తుతం కొంత బంగారాన్ని దేవుడికి సమర్పించానని…మరికొంత బంగారాన్ని కూడా త్వరలోనే విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

satyavathi rathod: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న మంత్రి  సత్యవతి రాథోడ్: ఒంటిపై నగలన్నీ విరాళం - Telugu Oneindia

ఈ అద్భుతం కట్టడం సృష్టించిన సీఎం కేసీఆర్​కు మరింత శక్తిని ఇవ్వాలని ఆ స్వామివారిని ప్రార్థించాను. ఒకప్పుడు యాదగిరి గుట్ట… ఇప్పటికి చాలా తేడా ఉంది.

తాను కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని,  ప్రజలంతా ఆయురారోగ్యాలతో.. పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని తాను నరసింహ స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు. అంతేకాకుండా 2022 ప్రజలకు కలిసిరావాలని అని అన్నారు..

Related posts