telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్లాష్‌ : ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కు కరోనా పాజిటివ్..!

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అయితే.. తాజాగా ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్,ప్రముఖ పత్రికా రచయిత, సాహిత్య కారుడు కె. శ్రీనివాస్ ‘కోవిడ్’బారిన పడ్డారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. కాగా… తెలంగాణలో గత 24 గంటల్లో 163 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో ఒక్కరు మృతి చెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,00,717 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 2,97,195 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 1,650 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 96.8 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 98.82 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 1,872 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Related posts