కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ ఉగ్రవాదుల అడ్డా అని కిషన్ రెడ్డి చేసినట్టుగా వస్తున్న కథనాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ కేంద్ర సహాయమంత్రి నోట ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి వస్తుందనుకోలేదని అన్నారు. హోదాలో ఉన్న వ్యక్తికి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు తగవని ఒవైసీ హితవు పలికారు.
హైదరాబాద్ అంటే ఎంత ద్వేషమో ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని మండిపడ్డారు.ఈ ఐదేళ్లలో ఎన్ఐఏ, ఐబీ, రా అధికారులు ఎన్నిసార్లు హైదరాబాద్ ను ఉగ్రవాదుల అడ్డా అని పేర్కొన్నారని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ అభివృద్ది చెందడం వీళ్లకు ఇష్టంలేనట్టుందని ట్విటర్ లో పేర్కొన్నారు.
రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి.. పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చారు: దేవినేని