telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

గుర్తింపు లేని స్కూళ్లకు నోటీసులు..జూన్ 12లోగా గుర్తింపు పొందాలి!

Hyderabad Public School Admission Applications

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ యంత్రాంగం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో గుర్తింపు లేకుండా నడుస్తున్న స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం సమామత్తమవుతోంది. గుర్తింపు లేని స్కూళ్లను గుర్తించి నోటీసులు జారీచేయాలని అధికారులు నిర్ణయించారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభంలోగా జూన్ 12లోగానే పాఠశాలలు గుర్తింపు పొంది ఉండాలని తెలిపారు. స్కూళ్లన్నీ అనుమతులు తీసుకోవాలని, లేదంటే సీజ్‌ చేస్తామని హెచ్చరికలను జారీ చేస్తున్నారు.

జూన్ రెండవ వారం తరువాత జిల్లాలో ఒక్క గుర్తింపు స్కూల్ ఉండరాదని టార్గెట్‌గా పెట్టుకున్న విద్యాశాఖ ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి జిల్లాలోని గుర్తింపులేని స్కూళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన డీఈఓ క్షేత్రస్థాయి మండల విద్యాశాఖ అధికారుల స్థాయిలో అనుమతిలేని స్కూల్క్‌ను గుర్తించేపనిలో విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

గుర్తింపు లేని పాఠశాలలను విద్యా సంవత్సరం మధ్యలో మూసివేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్స్ ప్రారంభంకు ముందుగానే జిల్లాలో ఒక్క గుర్తింపులేని స్కూల్ ఉండకుండా విద్యాశాఖ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. స్కూళ్లముందు గుర్తింపు లేని స్కూళ్లుగా దృవీకరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని, గుర్తింపు లేని స్కూల్స్ ఉన్నైట్లెతే వెంటనే అను మతుల కొరకు దరఖాస్తులను సమర్పించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Related posts