telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రజలే చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలి: కేంద్ర మంత్రి

చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులను కొనుగోలు చేయరాదని దేశవ్యాప్తంగా ప్రచారంజరుగుతోంది. ఇప్పటికే చైనా నుంచి దిగుమతులను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు తగిన విధి విధానాలను అతి త్వరలో ప్రకటించనుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఈ విషయంలో ప్రజలే చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాల్సి వుందన్నారు. ప్రజల్లో స్పందన వస్తేనే చైనాకు బుద్ధి వస్తోందని అన్నారు.

భారత వస్తువుల క్వాలిటీని పెంచేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలను కఠినతరం చేసిందని గుర్తు చేశారు. అతి త్వరలో కొత్త నిబంధనలు, నియంత్రణా విధానాన్ని దిగుమతులపై ప్రకటించనున్నామని రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ నిబంధనలు అమలులోకి వస్తే, చౌక, తక్కువ క్వాలిటీతో కూడిన దిగుమతులకు అడ్డుకట్ట పడుతుందని ఆయన అన్నారు. ఇండియాలో ప్రస్తుతం 25 వేలకు పైగా వస్తు ఉత్పత్తులకు బీఐఎస్ నిర్ధారణ ఉందన్నారు. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే, క్వాలిటీతో కూడిన మరిన్ని ఉత్పత్తులు ఇండియాలోనే లభిస్తాయని అన్నారు.

Related posts