telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైకుంఠద్వార దర్శనంలో సిఫారసు లేఖలు తీసుకోం..

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 13 నుంచి 22 వ‌ర‌కు సిఫార్సు లేఖలు తీసుకోబోమని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

Tirumala Tirupati Devasthanams issues guidelines for darshan of Sri  Venkateswara Swamy | India News | Zee News

పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనంలో సామాన్య భక్తులకు ఎక్కువ సమయం దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందువల్ల పది రోజుల పాటు సిఫార్సు లేఖలు తీసుకోబోమన్నారు. వీఐపీలు స్వయంగా వస్తేనే టిక్కెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీ కి సహకరించాలని ఆయన కోరారు.

Tirupati: 10-day Vaikunta Dwara Darshan begins amid religious fervour

కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు జరుగుతున్నందున తిరుమలలో తీవ్రమైన వసతి కొర‌త ఉందని ..వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు నందకం, వకుళామాత వసతి సముదాయాల్లో గదులు కేటాయిస్తామని తెలిపారు.

శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లు పొందిన భక్తులు తిరుపతిలోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి గ‌దులు పొందాలని చైర్మన్ తెలిపారు.

Related posts