ఏపీలో కరోనా విజృంభిస్తున్ననేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని దుయ్యబట్టారు. కరోనా తీవ్రత ఎలావుందో ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పారని తెలిపారు.
ఏపీ నాయకత్వం మాత్రం కరోనా ఓ ఫ్లూ వంటిదని చెబుతోందని తెలిపారు. దీన్నిబట్టి ప్రభుత్వం చేతులెత్తేసినట్టు అర్థమవుతోందని, ప్రజలే జాగ్రత్తలు పాటించాలని పవన్ పిలుపునిచ్చారు. కాపు కార్పొరేషన్ల అంశంపై పవన్ ప్రస్తావిస్తూ కార్పొరేషన్ల నిధులు, సబ్ ప్లాన్ నిధులను నవరత్నాల్లో కలిపేస్తున్నారని ఆరోపించారు. కాపు కార్పొరేషన్ సహా ఇతర కార్పొరేషన్ల నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.