ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి పంచాయితీ ఎలక్షన్. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో కార్మికులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. అయితే.. తాజాగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేంద్రం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని సూచించారు. ఉక్కు ఫ్యాక్టరీతో ప్రజలకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేశారు. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా.. ప్లాంట్ పరిరక్షణపై దృష్టి పెట్టాలని మోడీని కోరారు చంద్రబాబు. ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం సొంతంగా గనులు కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.
previous post