telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అతన్ని చూడగానే వెరీ హాట్ అని చెమటలు పట్టాలి”… విష్ణుప్రియ కామెంట్స్

Vishnu-Priya

పోవే పోరా అంటూ సుడిగాలి సుధీర్‌తో కలిసి బుల్లితెరపై సందడి చేసే యాంకర్ విష్ణ ప్రియ.. సోషల్ మీడియాలో హాట్ హాట్ పొటోలతో పాటు.. డాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ యమా యాక్టివ్‌గా ఉంది. ఇక ఈ బ్యూటీ తాజాగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అయితే లేదు.. మరో నాలుగేళ్లు వరకూ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఒక ఫ్యామిలీని డీల్ చేయాలంటే చాలా మెచ్యురిటీ ఉండాలి.. 29-30 ఏళ్లు వస్తే వస్తుందేమో అప్పుడు ఆలోచిస్తా పెళ్లి గురించి. నాకు కాబోయే వాడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే.. మొదటిగా దేవుడికి ఉన్నంత ఓర్పు కావాలి. ఎందుకంటే నన్ను తట్టుకోవడం అతని వల్ల కాదు ఓర్పు లేకపోతే. ఇక చూడ్డానికి చాలా బాగుండాలి.. మహిళలకు గౌరవం ఇవ్వాలి. డియర్ కామ్రేడ్‌లా ఉండాలి. చాలా పొడుగ్గా ఉండాలి.. అరబిక్ ఫేస్ కట్స్‌తో అతన్ని చూడగానే వెరీ హాట్ అని చెమటలు పట్టాలి. రియల్ లైఫ్‌లో అలాంటి అబ్బాయిలు కనిపించినప్పుడు నేను డైరెక్ట్‌గా వెళ్లి లుక్స్ హాట్ అని చెప్పేస్తా.. ఈ విషయంలో అస్సలు సిగ్గు పడను. అలాంటి అవకాశాన్ని వదులుకోను. అసలే హైదరాబాద్‌లో ఇలాంటి వాళ్లు రేర్‌గా కనిపిస్తున్నారు. నేను అందాన్ని ఇష్టపడతా.. వాళ్లని చూసి నేత్రానందం పొందుతుంటా’ అంటూ తన కలల రాకుమారుడిలో ఉండాల్సిన లక్షణాల లిస్ట్ చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ.

Related posts