telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పహిల్వాన్ : ఆకట్టుకుంటున్న కుస్తీ టీజర్, మేకింగ్ వీడియో

Pehlwan

కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ప్ర‌స్తుతం ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో “ప‌హిల్వాన్” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో “ప‌హిల్వాన్” అనే టైటిల్ తో విడుద‌ల కానుంది. ఆ మ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయించారు. ఇటీవల చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులోని స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. “బ‌లం ఉంద‌నే అహంతో కొట్టేవాడు రౌడీ… బ‌ల‌మైన కార‌ణం కోసం కొట్టేవాడు యోధుడు” అనే డైలాగ్ ఆక‌ట్టుకుంది. సెప్టెంబ‌ర్ 12న చిత్రం విడుద‌ల కానుంది. సుదీప్ తెలుగులో ఈగ‌, బాహుబ‌లి వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి “పహిల్వాన్ కుస్తీ టీజర్ ను, మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్రబృందం. మీరు కూడా ఈ వీడియోలను వీక్షించండి.


Related posts