telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

యస్ బ్యాంకు సంక్షోభం.. రాణా కపూర్ అరెస్ట్

yes bank rana

యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. యస్ బ్యాంకు సంక్షోభం వెనక ఆయన హస్తం ఉందని అనుమానిస్తున్న ఈడీ శుక్రవారం సాయంత్రం ముంబైలోని ఆయన నివాసంలో సోదాలు జరిపింది. అనంతరం విచారణ కోసం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు ఆయనను 20 గంటలు విచారించారు. అనంతరం ఈ వేకువ జామున ఆయనను అదుపులోకి తీసుకుంది. విచారణకు సరిగా సహకరించకపోవడం వల్లే రాణా కపూర్‌ను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం యస్ బ్యాంకు డెబిట్ కార్డులను ఉపయోగించి సొంత బ్యాంకు ఏటీఎంలతోపాటు ఇతర ఏటీఎంలలోనూ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని బ్యాంకు ట్వీట్ చేసింది. యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి డబ్బు విత్‌డ్రాకు ఇబ్బంది పడుతున్న ఖాతాదారులకు ఊరటనిచ్చింది.

Related posts