telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఢీ.. లేడీ టెక్కి దుర్మరణం

Accident

హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నంబరు 3లో ఆర్టీసీ బస్సు ఓ బైకును ఢీ కొట్టడంతో టీసీఎస్ లో పని చేస్తోన్న ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు డ్రైవర్ ను చితక్కొట్టారు. ఆర్టీసీ తాత్కాలిక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడని దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు.

అతడి నిర్లక్ష్యంపై ఆగ్రహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సుపై కూడా స్థానికులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు సోహిని సక్సేనాగా గుర్తించారు.

Related posts