telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్‌ 28, ఆదివారం రాశిఫలాలు

మేషరాశి..

వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ ధైర్యంతో అధిగమిస్తారు. పెద్దలు, కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటే మంచిది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి.

వృషభరాశి..

చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఒక ఘటన మానసిక శక్తిని పెంచుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విందు వినోదాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. దైవ ద‌ర్శనాలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా ప‌డ‌తాయి.

మిథునరాశి..

గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉత్సాహవంతంగా అందరితో గడుపుతారు. ఆస్తిలాభం . సోదరులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది . ఆరోగ్యం అంత‌గా స‌హాక‌రించ‌దు.

కర్కాటకరాశి..

అనారోగ్యం భంగం క‌లుగుతుంది. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. శ్రమ పెరిగినప్పటికీ.. పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన ఆర్థిక సహాయం అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

సింహరాశి..

అనుకున్న కార్యాల్లో మంచి ఫలితాలున్నాయి. వాహనయోగం క‌లుగుతుంది. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. కీలక వ్యవహారంలో జాగ్రత్తలు అవసరం.విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరప్రయాణాలలో మెళుకువ అవసరం.

కన్యరాశి..

వాహనం నడుపునప్పుడు మెళుకువ అవసరం. చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కీలక నిర్ణయాల్లో జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి.

తులరాశి..

ఉన్నత స్థాయి వ్యక్తుల సహాయ, సహకారాలు లభిస్తాయి. అవసరానికి ఆర్థికసాయం అందుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దలు సలహాలు, సూచనలు మేలు చేస్తాయి. సంఘంలో ఆదరణ ల‌భిస్తుంది.

వృశ్చికరాశి..

బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పూర్వపు మిత్రుల కలయిక మీకు సంతృప్తినిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి ఆర్థిక సాయం అందుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌దు.

ధనుస్సురాశి..

కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మీకు రావలసిన అవకాశాలు రాకపోవడం, పక్కవాళ్లకు రావడంతో కాస్త నిరుత్సాహం ఆవరిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాస్త నిరుత్సాహం ఎదురైనప్పటికీ.వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి చెందుతాయి.

మకర‌రాశి..

చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. సన్నిహితుల సాయంతో ఆటంకాలను అధిగమిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు.

కుంభరాశి..

రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ఇబ్బందులెదురవుతాయి.అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలు వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చర్చలు సఫలం అవుతాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి.

మీనరాశి..

విద్యార్థునులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. స్పెక్యులేషన్ సామాన్యంగా ఉంటుంది. చేపట్టే పనుల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మొహమాటం మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. బంధువులతో గొడవలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త వ‌హించ‌డం మంచిది.

 

 

Related posts