telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 8(బుధవారం) రాశి ఫలాలు

మేషం: ఆర్థికంగా పర్వాలేదు. కీలకమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. పెద్దలతో పరిచయాలు ఉంటాయి. ఒత్తిడి పెరుగుతుంది. అందరినీ కలుపుకుని వెళితే మంచిది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఎవరికీ హామీలు ఉండొద్దు.

వృషభం: ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయానికి ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.

మిథునం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. వివాహ సంబంధాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. వృత్తి నిపుణులు శ్రమ ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

కర్కాటకం: ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. చిరు వ్యాపారులకు అనుకూలం. కీలక సమస్యను పరిష్కరిస్తారు. బంధుమిత్రుల సహాకారం ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి.

సింహం: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి.

కన్య: ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు అనుకూలం. వ్యాపారంలో లాభాలకు అవకాశం. ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సరైన ప్రణాళికతో ముందుకెళ్లండి. అప్పులు తీరుస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

వృశ్చికం: ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారులకు అనుకూలం. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నిస్తారు. మిత్రులను కలుసుకుంటారు. ఇతరులకు సహాయపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

ధనస్సు: ఆదాయం బాగుంటుంది. ఉద్యోగులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. తోటివారి సహకారం ఉంటుంది. వృత్తికి సంబంధించి కొత్త ప్రయత్నాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.

మకరం: ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టిన పనులు చాలావరకు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. గృహ, వాహన కొనుగోలుపై దృష్టి పెడతారు. వ్యాపారులకు అనుకూలం.

కుంభం: ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కీలక సమస్యను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సలహా పాటించండి. వివాధాలకు దూరంగా ఉండండి.

మీనం: చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ప్రణాళికాబద్ధంగా వెళ్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలు. తోటివారి సహకారం తీసుకుంటారు. పెద్దలను కలుసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Related posts