telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆప్ఘనిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించిన తాలిబన్లు

ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకుని పెను సంక్షోభం సృష్టించిన తాలిబన్లు ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మా దేశ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు అని తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. తమ కొత్త ప్రభుత్వానికి ముల్లా మహమ్మద్ హసన్ సారధ్యం వహిస్తారని, ఉప ప్రధానిగా తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. ఆప్ఘనిస్తాన్‌ కైవసంలో కీలకంగా పనిచేసిన కొందరికి కీలక పదవులు అప్పగించారు.

ఆప్ఘనిస్తాన్ రెండో ఉప ప్రధానిగా తాలిబన్ కీలక నేత మౌలావి హనాఫీని, రక్షణ మంత్రిగా తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ తనయుడు ముల్లా యాకూబ్‌, అంతర్గత వ్యవహారాల మంత్రిగా సిరాజుద్దీన్ హక్కానీని నియమించినట్టు ప్రకటించారు. కేబినెట్ ఏర్పాటు ఇంకా పూర్తికాలేదని, ఇది తాత్కాలికమేనని తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఆగస్టు15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 30న అమెరికా బలగాలు ఆప్ఘన్‌ను విడిచి వెళ్లిపోయాయి.

Related posts