telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 24 (మంగళవారం) రాశి ఫలాలు

మేషం: ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మిత్రుల సహకారం ఉంటుంది. తలపెట్టిన ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

వృషభం: ఆదాయం నిలకడగా ఉంటుంది. చేపట్టిన పనులుపట్టుదలగా పూర్తి చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. వృత్తి, వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వివాహ సంబంధాలకు అనుకూలం.

మిథునం: ఉద్యోగంలో ఉన్నతికి అవకాశాలు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం మెరుగవుతుంది. విశ్రాంతి చాలా అవసరం

కర్కాటకం: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగపరంలో ఉన్నతికి అవకాశాలు. వ్యాపారులకు అనుకూలం. కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వివాహ సంబంధాలకు అనుకూలం. కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి.

సింహం: ఉద్యోగంలో మార్పులకు అవకాశం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలుంటాయి. కొత్త నిర్ణయాలు, ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాశం.

కన్య: ఆర్థికంగా బాగుంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. కష్టంమీద కొన్ని పనులు పూర్తిచేస్తారు. స్నేహితుల సహకారం తీసుకుంటారు. వృత్తి వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

తుల: ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంలో సమస్యను పరిష్కరిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది.

వృశ్చికం: ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులను అదుపు చేసుకోవాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో మీ నిర్ణయాలు ఫలిస్తాయి. ఇతరులకు సహాయ పడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

ధనస్సు : అవసరానికి తగిన డబ్బు అందుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కుటుంబ సమస్యను పరిష్కరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.

మకరం: ఉద్యోగులకు అనుకూలం. వ్యాపారంలో లాభాలు నిలకడ ఉంటుంది. అప్పులు తీరుస్తారు. మిత్రులకు సహయం అందిస్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు కష్టంమీద పూర్తి చేస్తారు.

కుంభం : ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా అనుకూలం. వాహనం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మంచి నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

మీనం: ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. వివాహ సంబంధాలకు అనుకూలం. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉల్లాసంగా గడుపుతారు.

Related posts