telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 16, మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు…

మేషరాశి..

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. వ్యక్తిగత అవసరాల కోసం అడ్డూఅదుపూ లేకుండా చేసే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి.

వృషభరాశి..

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం ద్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. మీ ఆలోచనలను ఆచరణలోకి తేవడం, మీ అభిరుచికి తగినట్టుగా ప్రవర్తించడం మంచిది.సన్నిహితుల సాయం అందుతుంది.

మిథునం రాశి

విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. సోదరీసోదరులు, సన్నిహితులకు సంబంధించి ఖర్చులు అధికం. మీ మీ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటక రాశి..

గృహంలోని మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. రాజకీయాల్లో వారికి ఆదరాభి మానాలు అధికం అవుతాయి. ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కోర్టు కేసులో గెలిచే సూచనలున్నాయి. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అనారోగ్యం ఇబ్బందిపెడుతుంది. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఆలయాలు సందర్శిస్తారు.

సింహ రాశి..

చిన్నతరహా, కుటీర పరిశ్రమలవారికి ఆశాజనకం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చిరస్మరణీయ విజయాలు సొంతం అవుతాయి. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్యరాశి..

ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తుల సహాయం పొందుతారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి తప్పడు. గతంలో నిలిపివేసిన పనులు ఇవాళ చేస్తే కలిసొచ్చే అవకాశం ఉంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు.

తుల రాశి..

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. ఇతరుల భాగస్వామ్యంతో వ్యాపారం చేసినవారు.. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్య, ఆహార విషయాల్లో అధికమైన జాగ్రత్త అవసరం.శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు.

వృశ్చిక రాశి..

నిరుద్యోగులలో నిరుత్సాహం, నిర్లిప్తత అధికమవుతాయి. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చకండి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఎదుర‌వుతాయి.

ధనస్సు రాశి..

అనారోగ్యం భారిన ప‌డ‌తారు. మానసిక అశాంతి క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయవద్దు. అభివృద్ధి కోసం ఎక్కువ సమయాన్ని వినియోగించండి.

మకర రాశి..

ప్రారంభించబోయే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఉద్యోగం అనుకూలంగా ఉంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన మార్పులు చేస్తారు.

కుంభరాశి..

ఉత్సాహంగా పని చేయాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. ల స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి రావటానికి మరి కొంత సమయం పడుతుంది. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం భారిన ప‌డ‌తారు.

మీనరాశి..

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చిన్ననాటి సన్నిహితులను కలుసుకుంటారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి.

 

 

Related posts