telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 19, బుధవారం రాశిఫ‌లాలు..

మేష రాశి..

బంధువులతో విరోధాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. సోదరులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. దైవదర్శనాలు చేస్తారు. ఇతరులకు హాని చేసే పనులను చేయ‌డం మంచిది కాదు. ఉద్యోగస్తుల‌కు ఆకస్మిక మార్పులు చేర్పులు ఉంటాయి.

వృషభరాశి..

సంఘంలో గౌరవం పెరుగుతుంది.ఆరోగ్యం మంద‌గిస్తుంది. మిత్రుల నుంచి సహాయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి.బంధువులతో సంబంధాలు బాగుంటాయి. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.ఆర్థికంగా బాగుంటుంది.

మిథునరాశి..

కష్టపడ్డా ఫలితం కనిపించదు. మహిళలకు పని భారం అధికం అవుతుంది. కొన్ని ముఖ్య‌మైన‌ వ్యవహారాలలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధువుల‌తో త‌గాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డం మంచిది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో గంద‌ర‌గోళంగా ఉంటుంది.

కర్కాటకరాశి..

రావాల‌సిని డ‌బ్బు చేతికివ‌స్తుంది. వాహనాలు కొంటారు. నూతన ఉద్యోగాలలో చేరతారు. అనుకోని ధ‌నలాభం వ‌స్తుంది. సన్నిహితుల నుంచి శుభ‌వార్త‌లు వింటారు. ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు.

సింహరాశి..

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఖర్చులు అధిక‌మ‌వుతాయి. మానసిక అశాంతి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ‌స్తుల‌కు పై అధికారులు నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. విద్యార్థులు చ‌దువు మీద శ్ర‌ద్ధ చూపించ‌క‌పోవ‌డం వ‌ల్ల చికాకులు ఎదుర్కొంటారు . అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.

కన్యరాశి..

సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడ‌తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కాంట్రాక్టులు పొందుతారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగ‌స్తుల‌కు అనుకోని మార్ప‌లు చేస్తారు. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

తులరాశి..

వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభ‌సాటిగా సాగుతాయి. నూత‌న వ‌స్తు , వాహన కొనుగోలు చేస్తారు . కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు..

వృశ్చికరాశి..

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక ఇబ్బందులునుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు ముందుకు సాగవు. కుటుంబంలో ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులు అనుకోని చిక్కులు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం దెబ్బ‌తింటుంది.

ధనుస్సురాశి..

ఖ‌ర్చులు అధిక‌మ‌వుతాయి. కుటుంబంలో త‌గాదాలు ఏర్పడ‌తాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది.  ఆరోగ్యసమస్యలు ఎదుర‌వుతాయి. ఉద్యోగాలలో మార్పులు చేర్పులు చేస్తారు. వ్యాపారాలు విస్త‌రిస్తారు. దైవదర్శనాలు చేస్తారు.

మకరరాశి..

మనసికంగా ఆందోళనకు గురవుతారు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఏర్ప‌డుతుంది. విందువినోదాలు పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల‌కు ఇంటర్వ్యూలు అందుతాయి.

కుంభరాశి..

ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబంలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు మంద‌గిస్తాయి. ఉద్యోగస్తుల‌కు ప‌ని భారం అధికమ‌వుతుంది. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు.

మీనరాశి..

వ్యాపారాలు లాభ‌సాటిగా సాగుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల‌తో త‌గాదాలు ఏర్ప‌డ‌తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు వ‌స్తాయి. దైవ‌ద‌ర్శ‌నాలు.

 

Related posts