telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 15, బుధవారం రాశిఫలాలు

మేషం…
ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. కొద్దిపాటి ఆస్తిలాభం. చెల్లింపులు, బ్యాంకు చెక్కులు జారీలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.

వృషభం…
సన్నిహితుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది . పలుకుబడి పెంచుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది.

మిథునం….
రిటైర్డు ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ అందుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు. దూరప్రయాణాలు.

కర్కాటకం….
సన్నిహితులతో మాటపట్టింపులు. మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించండి. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

సింహం….
ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నూతన పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఆదాయానికి తగ్గుట్టుగా ఖర్చులుంటాయి.

కన్య…
రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం, కార్యసిద్ధి. దైవ సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు.

తుల….
ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. వైద్యులకు బాధ్యతల్లో అలక్ష్యం మంచిదికాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు.

వృశ్చికం...
పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలిసిరావు. బంధుమిత్రులకు సహాయ సహకారాలందిస్తారు. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. ఖర్చులు, అధికం, ప్రయోజనకరం.

ధనుస్సు…
కొత్త పరిచయాలు. ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ఆస్తుల విషయంలో కొత్త అంచనాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.

మకరం….
నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సోదరుల నుంచి ధనప్రాప్తి. కుటుంబసమస్యల పరిష్కారం. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. ఊహించిన ఖర్చులే ఉంటాయి.

కుంభం…
రుణాల కోసం యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ముఖ్యమైన వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. అవివాహితులకు శుభదాయకం. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే సూచనలు అధికంగా ఉన్నాయి.

మీనం…
వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

Related posts