telugu navyamedia
ఆరోగ్యం

రోజుకు రెండు పియర్స్‌ పండ్లు తింటే లాభాలు ఎన్నో..!

*తక్కువ తీపితో రుచికరంగా ఉండే పియర్స్ పండ్లను తింటే బరువు తగ్గుతారు. అంతేకాదు టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులకు అవకాశాలు తక్కువ. వీటిలోని ఫైబర్ ఎన్నోప్రయోజనాలు కలిగిస్తోంది.

*యాపిల్ వలె కనిపించే పియర్స్‌లో పోషకాలు ఎక్కువ. ఎవరైనా వీటిని తినవచ్చు. అందుకే వీటిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. వీటిని బేరిపండు అనికూడా అంటారు. పియర్స్‌లో కాల్షియం, ఫొలేల్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ C, E, K ఉంటాయి. అలాగే బీటా-కెరోటిన్, ల్యూటెయిన్,ఖోలైన్, రెటినాల్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

*డయాబెటిక్స్ ఉన్న వారు కూడా ఈ పండును తీసుకోవచ్చు. వీటిలో కార్బోహైడ్రేట్స్‌, తక్కువ కేలరీలతో, ఎక్కువ పీచు పదార్థంతో అందరూ తినేందుకు వీలవుతోంది. మన శరీరంలో ఉండే విష వ్యర్థాలను తొలగించే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లవనాయిడ్స్ కూడా ఉంటాయి. మలబద్ధక సమస్యలను తొలగిస్తుంది.

*పియర్స్‌లో ఉండే ఫైబర్ వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పద్ధతిగా ఉంటాయి. అందువల్ల డయాబెటిస్‌ను ఈ పండ్లు తగ్గిస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. పియర్స్ లో రాగి, కాల్షియం, పాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. దీంతో ఎముకలు ధృఢంగా ఉంటాయి. ఇవి ఎర్రరక్త కణాల సంఖ్యని పెంచుతాయి. నీరసం తగ్గిస్తుంది.

*పియర్స్‌లో ఎక్కువ భాగం నీరు, పీచు ఉండటం వల్ల ఇవి తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం తప్పుతుంది. రోజుకు రెండు పియర్స్ తినేవాళ్లకు నడుం చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది. పియర్స్‌లో విటమిన్ సి ఉంటుంది. దీంతో మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి దోహదపడుతుంది.

*రుచి బాగుందని పియర్స్ మరీ ఎక్కువగా తిన్నా ప్రమాదమే. రోజుకు రెండు కంటే ఎక్కువ పండ్లను తింటే కడుపులో గ్యాస్, పొట్ట ఉబ్బరం, నొప్పి, విరోచనాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం. ఏదీ అతి మంచిది కాదు. పరిమితంగానే తీసుకోవాలి.

Related posts