telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 20 (శుక్రవారం) రాశి ఫలాలు

మేషం: అన్ని విధాలా కలిసి వచ్చే సమయం. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి. ఉద్యోగపరంగా స్థిరమైన ఫలితాలుంటాయి. కొన్ని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

వృషభం: ఆటంకాలు, అవరోధాలు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగులకు అనుకూలం. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. దగ్గరి బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం.

మిథునం: ఉద్యోగంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అనుకూలం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ సంబంధాలకు అనుకూలం. ఆరోగ్యం మెరుగవుతుంది.

కర్కాటకం: ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభదాయకం. కొత్త పనులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహ సంబంధాలకు అనుకూలం. వృత్తి నిపుణులకు అవకాశాలు వస్తాయి.

సింహం: అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మంచి శుభయోగాలున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నతికి అవకాశాలు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని నిర్ణయాలు ఎంతగానో కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కన్య: వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల వల్ల శ్రమ ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆటంకాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. వివాహ సంబంధాలకు అనుకూలం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తుల: వ్యాపారులకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశాలు. కొంత ఒత్తిడి తప్పదు. కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి. వివాహ సంబంధాలకు అనుకూలం. కీలక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

వృశ్చికం: ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు పని చేస్తాయి.

ధనుస్సు: వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు, ఒత్తిడి తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కుటుంబ సమస్య నుంచి గట్టెక్కుతారు. సన్నిహితులతో సఖ్యతగా ఉండాలి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. బంధువుల సహాయ సహకారాలుంటాయి.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్త పడాలి. ఆరోగ్యం మెరుగవుతుంది. స్నేహితుల సహకారం తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.

కుంభం: ఆర్థికంగా మేలు జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడాలి. అధికారులతో సఖ్యతగా వ్యవహరించండి. పనుల ఒత్తిడి ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారారులకు అనుకూలం.

మీనం: ఉద్యోగంలో చక్కని ఫలితాలు సాధిస్తారు. తగిన విధంగా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. మనోధైర్యంతో చేసేపనులు విజయాన్నిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. మిత్రుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వివాహ సంబంధాలకు అనుకూలం

Related posts