మేషం : ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవరోధాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
వృషభం : శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలమవుతాయి.
మిథునం : కొత్తగా రుణాలు యత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. దైవదర్శనాలు.
కర్కాటకం : సన్నిహితులు దగ్గరవుతారు. కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి..
సింహం : నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం..
కన్య : ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో కొద్దిపాటి అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. సోదరులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల : రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో కొంత ఒడిదుడుకులు. ఆరోగ్యభంగం. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు.
వృశ్చికం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
ధనుస్సు : చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. శుభవార్తలు వింటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మకరం : ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.. ఆలయ దర్శనాలు.
కుంభం : కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. పనుల్లో శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
మీనం : కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. నూతన ఉద్యోగయోగం.
స్టాలిన్ షాక్ తో కేసీఆర్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్: విజయశాంతి