మేషం : కొత్త వ్యాపారాలు, సంస్థలు, పరిశ్రమల స్థాపనలకు కావలసిన అనుమతులు, వనరులు సమకూర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్, వైద్య కోర్సుల్లో అవకాశం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది.
వృషభం : ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. స్థిరాస్తి మూలకన ధన అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధన వ్యయం విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు.
మిథునం : హామీలు, మధ్యవర్తిత్వాలు తగదు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తిచేస్తారు. పరిచయం లేనివారితో జాగ్రత్త. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. సంప్రదింపులు, వ్యవహారాల ఒప్పందాలకు అనుకూలం.
కర్కాటకం : ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తలెత్తగలవు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు.
సింహం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఖర్చులు పెరిగినా ఆదాయానికి లోటుండదు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి ఆశాజనకం. సలహా కంటే సొంత నిర్ణయాలే శ్రేయస్కరం. పాత మిత్రులతో కలిసి విందు, వినోదాలలో ఉల్లాసంగా గడుపుతారు.
కన్య : వస్త్ర, బంగారుం, వెండి, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. అధికారులకు అదనపు బాధ్యతలు విశ్రాంతి లోపం. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. వృత్తుల వారికి బాధ్యతలు పెరుగుతాయి.
తుల : హోటల్, క్యాటరింగ్ పనివారికి కలిసిరాగలదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
వృశ్చికం : బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. విద్యార్థులు భయాందోళనలు వీడి మనోధైర్యంతో శ్రమించాలి. రుణ విముక్తులవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
ధనస్సు : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీ శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. సమయానికి ధనం అందక అవస్థ పడుతారు. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు ఎదురవుతాయి.
మకరం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. బంధువులతో సఖ్యత ఏర్పడటంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు అధికమవుతాయి.
కుంభం : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. పాత రుణాలను తీరుస్తారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
మీనం : ఉపాధ్యాయులకు బాధ్యతలతో పాటు పనిభారం కూడా అధికమవుతుంది. వాతావరణంలోని మార్పు వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి.
అందుకే బీజేపీ ప్రభుత్వం ఆటలు సాగుతున్నాయి: చిదంబరం