telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 16, ఆదివారం రాశిఫ‌లాలు..

మేషరాశి..

ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. నూత‌న కార్యక్రమాలు చేపడుతారు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్ప‌డుతుంది. ఆసక్తికరమైన సమాచారం. బందు మిత్రుల‌తో విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము చేతికందుతుంది. భూ, వ‌స్తు లాభాలు వ‌స్తాయి.

వృషభరాశి..

అనవసర విషయాల్లో తలదూర్చక‌పోవ‌డం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతఅంత మాత్రంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వ‌స్తాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల‌కు పై అధికారులునుంచి ఒత్తిడిలు త‌ప్ప‌వు.

మిథునరాశి..

కుటుంబసమస్యలు త‌లెత్తుతాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల‌కు త‌ల‌పెడ‌తారు. వాహనయోగం క‌లుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల‌కు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకరాశి..

కొన్ని ముఖ్య‌మైన‌ పనులు వాయిదా పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వ్యాపారాలు సామానంగా సాగుతాయి. ఉద్యోగ‌స్తుల‌కు అధిక శ్ర‌మ ఉంటుంది. మిత్రులతో త‌గాదాలు ఏర్ప‌డ‌తాయి. కొన్ని విష‌యాల్లో ఓపిక‌తో ఉండ‌డం మంచిది.

సింహరాశి..

వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పై ప‌దవులు వెళ‌తారు. వాహనయోగం క‌లుగుతుంది.

కన్యరాశి..

నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడతారు. బంధువులు నుంచి పిలుపు వ‌స్తుంది. కుటుంబంతో స్థిరాస్తి వివాదాల స‌ద్దు మ‌ణుగుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో అనుకూలంగా ఉంటాయి. దైవదర్శనాలు చేస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

తులరాశి..

ఉద్యోగాలలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికరాశి..

ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్యమైన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర‌వుతాయి. మిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ‌వ‌కాశాలు ల‌భిస్తాయి. ధనం అధికంగా ఖ‌ర్చు చేస్తారు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు అంతగా క‌లిసిరావు.

ధనుస్సురాశి..

ముఖ్య‌మైన పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు ల‌భిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు ల‌భిస్తాయి. వ్యాపారాలు కలసివస్తాయి. బంధువుల‌తో స‌ర‌దా గ‌డుపుతారు. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు. ధైర్యంతో మందుడుగు వేస్తే విజ‌యం మీదే అవుతుంది.

మకరరాశి..

స్త్రీలకు ముఖ్య‌మైన విష‌యంలో ఏకాగ్రత చాలా అవసరం. చిన్ననాటి మిత్రులను క‌లుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. నిరోద్యోగుల‌కు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

కుంభరాశి..

ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. కుటుంబంలో సమస్యలు త‌లెత్తుతాయి. ఆరోగ్యసమస్యలు ఎదుర‌వుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. బంధువులతో విరోధాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.

మీనరాశి..

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బంది ప‌డ‌తారు . అనారోగ్యం బారిన ప‌డ‌తారు . వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగ‌స్తుల‌కు పై అధికారులతో మాట‌లు ప‌డ‌తారు.అనవసర విషయాలలో తలదూర్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Related posts