telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్ 23, శనివారం రాశి ఫలాలు..

మేషరాశి
ప్రారంభించే పనులలో ఆలస్య కానివ్వకుండా చూసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో అతి చనువుగా ఉండటం మంచిది కాదు. రాజకీయాల్లో వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి.

వృషభ రాశి
కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి మెరుగుప‌డుతుంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మిథున రాశి
ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అనారోగ్యం..వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. శ్రమకు మించిన ఫలితం ఉంటుంది. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేస్తారు. రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. చేపట్టే పనులలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కర్కాట‌క రాశి
చేతి వృత్తుల్లో వారికి ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. ముఖ్యమైన విషయాలలో సంబంధిత పెద్దలను కలుసుకుంటారు. తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగానే ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టే పనులలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.

సింహ రాశి
శ్రమకు త‌గ్గ ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. ఓ శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు.

కన్య రాశి
మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. రాజకీయాల్లో వారికి ఒడిదుడుకులు తప్పవు.

తుల రాశి
బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. వాహన సౌఖ్యం పొందుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. చేపట్టే పనులలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అకస్మిక ప్రయాణాలు చేస్తారు.

వృశ్చిక రాశి
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పనులు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. దూర ప్రయాణాలు ఉండే అవకాశం. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం మంచిది.

ధనుస్సు రాశి
మీమీ రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు ఉత్సాహ పరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టే పనులు అనుకూలంగా ఉంటాయి.

మకర రాశి
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు తప్పవు. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆలసట ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

కుంభ రాశి
పెట్టిన పెట్టుబడులలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. పనులు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీన రాశి
విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.సన్నిహితుల సాయం అందుతుంది. ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి.

Related posts