telugu navyamedia
సినిమా వార్తలు

“కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌”..

టాలీవుడ్ లో ఈశ్వర్’​ సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆరుఅడుగ‌ల అంద‌గాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. బహుబాలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు జపాన్ వంటి ఇతర దేశాలల్లో కూడా అభిమానులను సంపాదించుకుని.. ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ​ఇండియా స్టార్​గా ఎదిగాడు.

1979 అక్టోబరు 23న సూర్య నారాయణరాజు, శివకుమారి దంపతులకు జన్మించాడు ప్రభాస్‌. సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. ప్రముఖ కథానాయకుడు కృష్ణంరాజు ప్రభాస్‌కు పెదనాన్న. ఇంట్లో సినిమా వాతావరణం ఉన్నప్పటికీ సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదట ప్రభాస్‌. స్వతహాగా సిగ్గరి అయిన ఆయన.. వెండితెరపై అడుగుపెట్టి 19 సినిమాల్లో నటించాడు.

Palace - 1920x1080 Wallpaper - teahub.io

2002లో జయంత్​ సీ పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ‘ఈశ్వర్’​ సినిమాతో తెరంగేట్రం చేశాడు ప్రభాస్. జోడీగా అందాల తార మంజుల కూతురు శ్రీదేవి నటించింది. 2003లో ‘రాఘవేంద్ర’, 2004లో ‘వర్షం’, ‘అడవిరాముడు’ చిత్రాల్లో ప్రేమికుడిగా మంచిముద్ర వేశాడు. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చక్రం’ సినిమా ప్రభాస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

2005లో వచ్చిన ‘ఛత్రపతి’ ప్రభాస్​కు స్టార్​ ఇమేజ్​ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2006లో ప్రభుదేవా దర్శకత్వంలో ‘పౌర్ణమి’ చిత్రంలో వైవిద్యభరితమైన పాత్ర పోషించాడు. ఇది ఆశించిన స్థాయిలో రాణించక పోయినా ప్రభాస్‌కు మాత్రం హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2007లో ‘యోగి’, ‘మున్నా’, 2008లో ‘బుజ్జిగాడు’, 2009లో ‘బిల్లా’, ‘ఏక్‌ నిరంజన్​’ చిత్రాలు ప్రభాస్‌ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాయి. ‘బిల్లా’ చిత్రంలో తన పెదనాన్న, రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజుతో వెండితెర పంచుకున్నాడు.

Pan-India star Prabhas extends his best wishes to the team of 'Andaru Bagundali Andulo Nenundali' | Telugu Movie News - Times of India

2010లో ‘డార్లింగ్‌’ సినిమా ప్రభాస్‌పై రొమాంటిక్‌ హీరో ముద్ర వేసింది. తర్వాత 2011లో వచ్చిన ‘మిస్టర్​ ఫర్​ఫెక్ట్​’,2012లో ‘రెబల్‌’, 2013లో ‘మిర్చి’ సినిమాలు ప్రభాస్‌ కెరీర్‌ గ్రాఫ్​ను మరింత పెంచేశాయి. 2015, 2017లో విడుదలైన ‘బాహుబలి’ సిరీస్​లోని రెండు భాగాలు.. ప్రభాస్‌ కెరీర్‌ను ఎవరెస్ట్‌ అంత ఎత్తుకు తీసుకువెళ్లాయి. ఈ క్రమంలో ఎన్నో అంచనాలతో 2019లో హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైన సాహో పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా మూవీస్.. రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి రెడీ అయింది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్’, ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్-K’ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Prabhas

ఇక ప్రభాస్ కెరీర్‌లో మైల్ స్టోన్ అయిన 25వ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్నాడు. కెరీర్ లో 25 సినిమాలు కూడా పూర్తి చేయకుండానే గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ టాలీవుడ్ లో ఇప్పటి వరకూ ఏ హీరోకి సాధ్యంకాని సరికొత్త రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయంగా సినీ ప్రేమికుల హృదయాలను దోచుకున్న యూనివర్సల్ హీరో అమ్మాయిల డార్లింగ్ ప్ర‌భాస్‌ అక్టోబ‌ర్ 23న బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీజ‌ర్లు, ఫస్ట్‌లుక్‌, పోస్టర్లతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

డార్లింగ్ ప్ర‌భాస్‌కు న‌వ్య మీడియా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తుంది..

 

Related posts