ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ ప్రస్తుతం పలు టీవీ షోస్‌తో పాటు సినిమాలలోను నటిస్తున్నారు. ఇటీవల తన కో కమెడీయన్ వేణు మాధవ్ మృతి చెందడంతో అలీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా సౌదీ అరేబియాలో ఉన్న మక్కాని అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించారు. తెల్లని దుస్తులలో అలీ, తన కొడుకు ఉండగా కూతుళ్లు ఆయన భార్య బుర్ఖా వేసుకున్నారు. దాదాపు ప్రతి ఏడాది అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కాకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ముస్లింలకి పరమపవిత్రమైన స్థలం మక్కా. కాగా… ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Artist #Ali with family visits Mecca. pic.twitter.com/I4PapFEU2e
— BARaju (@baraju_SuperHit) 3 October 2019