telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నీకు ఇష్టమైతే బికినీలో ఓ రోల్ చేయడానికి చేయిస్తా… యాంకర్ కు వర్మ ఆఫర్

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మన స్టార్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ వర్మను ఇంటర్వ్యూ చేస్తూ అతన్ని రీసెంట్ టైంలో మీకు ఏ అమ్మాయిని చూస్తూ వావ్ అని అనిపించిందని వర్మను ఆ యాంకర్ అడగ్గా.. చాలామందిని అందులో నువ్వు కూడా అంటూ స్టైట్ ఆన్సర్ ఇచ్చేశాడు వర్మ. అతని ఆన్సర్‌కి తెగ సిగ్గుపడిపోయిన యాంకర్.. థాంక్యూ సార్ అంటూ మరో చిలిపి ప్రశ్న వేసింది. ‘మనిషికి కోరికలు అనేవి కామన్.. మీకు ఇప్పటి వరకూ తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా’? అని వర్మను అడగ్గా.. ‘నాకు ఒక కోరిక కలిగింది అంటే తీర్చుకోకుండా ఉండటం అనేది ఇప్పటి వరకూ జరగలేదు. నాకు ఒక కోరిక కలిగింది అంటే వెంటనే తీర్చేసుకుంటా. ఏ టైంలో ఎలాంటి కోరిక కలిగినా వెంటనే తీర్చేసుకుంటా. కోరికల్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా.. అందుకే మళ్లీ మళ్లీ తీర్చుకుంటూ ఉంటా. ఒకవేళ నా కోరిక తీరనిది అయితే.. దాన్ని నేను వెంటనే మర్చిపోతా. దాన్ని పట్టుకుని వేలాడను. నిజానికి నిన్ను (యాంకర్) బికినీలో చూడాలని ఉంది.. నేను నీకు ఆఫర్ ఇస్తా బికినీలో ఓ రోల్ చేయడానికి నీకు ఇష్టమైతే చేయిస్తా. లేదంటే ఆ కోరికను వదిలేసుకుంటా’ అంటూ మనసులో ఉన్న కోరికను చెప్పకనే చెప్పేశారు వర్మ. ఇక వర్మ ఆన్సర్‌కి బిత్తరపోయి చూడటం ఆ యాంకర్ వంతు అయ్యింది.

Related posts