telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నడి రోడ్డుపైనే లైంగిక వేధింపులు… రెజీనాకు చేదు అనుభవం

Regina

సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రెజీనా హవా ప్రస్తుతం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. తాజాగా ‘మిస్టర్ చంద్రమౌళి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరించింది. తన కాలేజ్‌ డేస్‌లో చెన్నైలోని ఓ పాపురల్‌ థియేటర్ దగ్గర కొంతమంది అబ్బాయిలు తనను లైంగికంగా వేధించారని, నడి రోడ్డుపైనే తన పెదాలను తాకేందుకు ప్రయత్నించడంతో ఎంతో బాధనిపించిందని రెజీనా చెప్పింది. తనను వేధించేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని జనంలోనే చితకబాదానని ఆమె తెలిపింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కాస్త వీక్‌గా ఉన్న తాను ప్రస్తుతం ఎలాంటి బాధనైనా భరించేంత స్ట్రాంగ్ అయ్యానని చెప్పింది. దీంతో ఆమె చెప్పిన ఈ విషయాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించిన రెజీనా.. చిరంజీవి హీరోగా రాబోతున్న ‘ఆచార్య’ మూవీలో ఐటెం సాంగ్‌లో నటిస్తోంది.

Related posts