telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ముంబయి : .. వెస్టిండీస్‌ పర్యటనకు.. భారత మహిళా జట్టు ఎంపిక ..

women team for west indies series

బీసీసీఐ వెస్టిండీస్‌ పర్యటనకు భారత మహిళా జట్టును ప్రకటించింది. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న సఫారీ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టునే విండీస్‌ పర్యటనకు ఖరారు చేసింది. వారితో పాటు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌ఉమెన్‌ సుష్మావర్మ జట్టులో చోటు సంపాదించింది. నవంబర్‌ 1 నుంచి వెస్టిండీస్‌తో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా ఐదు టీ20ల సిరీస్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసందే. తొలి మ్యాచ్‌లో భారత్ గెలవగా రెండో మ్యాచ్ వర్షార్పణమైంది.

జట్టు వివరాలు :
వన్డే జట్టు: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్ కౌర్‌ (వైస్‌ కెప్టెన్‌), స్మృతి మంధాన, జెమిమా, దీప్తి శర్మ, పూనమ్‌ రౌత్‌, హేమలత, జులన్‌ గోస్వామి, శిఖా పాండే, మాన్సి జోషి, పూనమ్‌ యాదవ్‌, ఏక్తా, రాజేశ్వరి, తానియా, ప్రియ, సుస్మ వర్మ

టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), జెమిమా, షెఫాలి వర్మ, దీప్తి శర్మ, హర్లీన్‌, తానియా, పూనమ్‌ యాదవ్‌, రాధ, వేద, అనుజ, శిఖ, పూజ, మాన్సి, అరుంధతి రెడ్డి.

Related posts