telugu navyamedia
సినిమా వార్తలు

షన్నూ​కి బర్త్‌డే విషెస్‌ చెప్పిన దీప్తి సునయన..

ప్రస్తుతం షణ్ముఖ్ జశ్వంత్ అనే పేరు టాలీవుడ్ హీరోల కంటే ఎక్కువగా వినిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన షణ్ముఖ్ జశ్వంత్ మొత్తానికి ఓ సెలబ్రేటి హోదాను అందుకున్నాడు. యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించి మంచి పేరు సంపాదించుకొని యూట్యూబ్ స్టార్ గా నిలిచాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు..

Deepthi Sunaina - Biography, Height & Life Story | Super Stars Bio

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ 5 తెలుగు సీజన్‌తో హౌజ్‌లోకి అడుగు పెట్టాడు. మొదటి వారం హౌజ్‌లో బిడియంగా ఉంటూ తనలోకంలో తానే ఉన్న షణ్ముక్‌ రెండో​ వారం హౌజ్‌మేట్స్‌తో కలిసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ రోజు(గురువారం) షణ్ముక్‌ పుట్టిన రోజు సందర్భంగా హౌజ్‌లో సందడి వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా షణ్ముక్‌ ప్రియురాలు, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ దిప్తీ సునయన అతడికి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

My girlfriend's name is Deepthi,' Reveals Shanmukh in Bigg Boss -

దీప్తి వర్చువల్‌ ద్వారా అర్థరాత్రి షణ్ముక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినట్లు సోషల్‌ మీడియా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. అంతేగాక తన స్నేహితులతో కలిసి బిగ్‌బాస్‌ హౌజ్‌ బయట టాపాసుల పెల్చీ వేడుకల చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీప్తితో పాటు వారి స్నేహితులు బిగ్‌బాస్‌ హౌజ్‌ బయటి నుంచి హ్యాపీ బర్త్‌డే షణ్ముక్‌ అంటూ గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేశా రు.

Related posts