telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న “కేజీఎఫ్-2” ?

kgf

2018లో విడుదలైన “కేజీఎఫ్” సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అక్రమ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రస్తుతం “కేజీఎఫ్ 2” రానుంది. ఇందులో కూడా ప్రధాన పాత్రలో యశ్, హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు. అధీరా లుక్ ని ఇటీవల సంజయ్ దత్ పుట్టినరోజు కానుకగా చిత్ర బృందం విడుదల చేశారు. ఇక లాక్ డౌన్ ముందు వరకు ఈ మూవీ షూటింగ్ నిరవధికంగా సాగింది. కేవలం 15రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం అందుతుంది. కాగా కెజిఎఫ్ 2 విడుదల తేదీ మారినట్లు సమాచారం అందుతుంది. కెజిఎఫ్2 విడుదల తేదీ అక్టోబర్ 23గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు థియేటర్స్ అప్పటికి తిరిగి ప్రారంభం అవుతాయనే గ్యారంటీ లేదు. దీనితో కెజిఎఫ్ 2 విడుదల సంక్రాంతికి మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెలలో షూటింగ్ మొదలుపెట్టి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి 2021 సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది.

Related posts