telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” టీంకు అల్లూరి యువజన సంఘం వార్నింగ్

RRR-Press-Meet

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. అలియా భ‌ట్‌, సముద్రఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారనే విషయం అందరిలో ఉత్సుకతను రేకెత్తిస్తున్నది. రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశమే ఈ చిత్ర‌మని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. బాహుబలి టీం లండన్ టూర్‌తో కొన్ని రోజులు “ఆర్ఆర్ఆర్” షూట్‌కు బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఈ చిత్రంపై ఇప్పుడు వివాదాలు మొదలయ్యాయి. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం “ఆర్ఆర్ఆర్” సినిమాపై అభ్యంతరాలు తెలిపింది. అల్లూరి సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసాడు. డబ్బుల కోసం.. కమర్షియల్ అంశాల కోసం ఓ సినిమా పేరుతో తమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారని.. అది రాజమౌళి లాంటి దర్శకుడికి అస్సలు తగదని వీరభద్రరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో పుట్టాడని.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న తెల్లవారి కాల్పుల్లో వీరమరణం పొందారని తెలిపాడు. అదే సమయంలో కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు తెలిపారు. వీరిద్దరికీ పరిచయం ఉన్నట్లు కానీ, స్నేహం ఉన్నట్లు కానీ చరిత్రలో ఎక్కడా లేదని, అసలు చరిత్రలో లేని విషయాలను సినిమాలో చూపించడం సరైన పద్దతి కాదని చెబుతున్నారు వాళ్లు. చరిత్రను వక్రీకరిస్తే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయని వాళ్లు హెచ్చరిస్తున్నారు. అలా జరక్కుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు వీరభద్రరావు వినతి పత్రం అందించాడు.

Related posts