telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్ .ఆర్ .మూవీ మేకర్స్ వెంకట్ ఇక లేరు

ఆర్ .ఆర్. మూవీ మేకర్స్ నిర్మాత వెంకట్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు జె . వి వెంకట్ ఫణింద్ర రెడ్డి . తెలుగు సినిమా రంగంలో వెంకట్ అంటే తెలియనివారు వుండరు. వెంకట్ మూత్ర పిండ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఉదయం 5. 30 గంటలకు తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.

వెంకట్ వయసు 57 సంవత్సరాలు తెలుగులో ది ఎండ్ , సామాన్యుడు , మాయాజాలం ,హంగామా, గుండమ్మగారి మనవడు, బహుమతి, కిక్ ,ప్రేమ కావాలి, డాన్ శ్రీను ,పైసా , ఢమరుకం, బిజినెస్ మన్ , లవ్లీ , విక్టరీ , ఇంగ్లిష్ లో డివోర్స్ ఇన్విటేషన్ చిత్రాలను నిర్మించారు. వెంకట్ ప్రతి సినిమా విడుదల సందర్భగా సేవా సంస్థలకు ఐదు లక్షల రూపాయలను అందించేవారు.

సినిమా అంటే ఎంతో మక్కువ వున్న వెంకట్ ప్రచారానికి దూరంగా ఉండేవారు. ఆయన ఫోటో కూడా ఎవరికీ తెలియదు. తెరవెనుక వుండే వెంకట్ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. వెంకట్ సేవా కార్యక్రమాలను గుర్తించిన యూనివర్సిటీ అఫ్ కొలంబో 2011లో గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.  వెంకట్ మృతికి పలువురు సంతాపం తెలిపారు .

Related posts