telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

అతను విడుదలకు ముందే “స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్” చూసి… చనిపోబోతున్నాడట…!

Star

డిస్నీ సంస్థ నిర్మిస్తున్న స్టార్ వార్ ఫ్రాంచైస్‌ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్’. డిసెంబర్ 20న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి ‘స్టా్ర్‌వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్’ సినిమా చూడాలని ఉందట. ఈ విషయాన్ని అతను చికిత్స పొందుతున్న రోవన్స్ హాస్పైస్ ఛారిటీ సంస్థకు తెలిపాడు. దాంతో అతని చివరి కోరిక ఎలాగైనా తీర్చాలని ఛారిటీ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి చివరి కోరిక గురించి తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేసింది. ‘మీరు సాయం చేస్తారా? మా ఛారిటీలో త్వరలో చనిపోబోతున్న ఓ వ్యక్తి స్టార్ వార్స్ వీరాభిమాని. స్టార్ వార్స్ ఫ్రాంచైస్ నుంచి రాబోతున్న ‘స్టా్ర్‌వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్’ సినిమాను తన కొడుకుతో కలిసి చూడాలనుకుంటున్నాడు. కానీ ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల అవుతోంది. కానీ అప్పటివరకు ఈ యువకుడు బతికి ఉండడు. అతని చివరి కోరిక ఎవరైనా తీరుస్తే బాగుంటుంది. దయచేసి ఈ ట్వీట్‌ను అందరికీ షేర్ చేయండి’ అని ఛారిటీ పేర్కొంది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలా మంది ఛారిటీకి మద్దతు తెలిపారు. ఎలాగోలా మొత్తానికి ఈ ట్వీట్ డిస్నీ సంస్థ ఛైర్మన్, సీఈఓ బాబ్ ఐగర్ దృష్టికి వచ్చింది. ఎలాగైనా ఆ వ్యక్తి చివరికోరికను తీర్చాలనుకున్నాడు. అమెరికాలో క్రిస్మస్‌కు ముందు జరుపుకునే థ్యాంక్స్ గివింగ్ వేడుక సందర్భంగా ఆ వ్యక్తికి ‘స్టా్ర్‌వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్’ సినిమాను చూపించాలనుకుంటున్నాం’ అని వెల్లడించారు. అయితే ఆ వ్యక్తికి ఎప్పుడు సినిమా చూపించబోతున్నారన్న విషయాన్ని మాత్రం డిస్నీ సంస్థ ఇంకా ప్రకటించలేదు.

Related posts