telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతు బందు సాయం అందని వారికి మరో అవకాశం

జూన్ 15 నుంచి తెలంగాణలో రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 60.84 లక్షల మంది రైతులకు రూ.7360.41 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో మొత్తం 147.21లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు జమ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే వ్యవసాయ భూమి కలిగి పట్టా పాస్ పుస్తకాలు కలిగిన వారు రైతుబంధు డబ్బుల జమ కాకపోతే తమ మండల ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. ఏఈఓలను సంప్రదించి తమ బ్యాంకు ఖాతా, పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లను సంబంధిత అధికారులకు సంప్రదించాలనిఈ మేరకు మంత్రి బ్యాంకు అధికారులను హెచ్చిరించారు.
రైతుబంధు నిధులను బ్యాంకర్లు పాతబాకీల కింద జమ చేసుకోవద్దని అన్నారు. రైతుబంధు నిధులను జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి రైతులకు అందజేయాలని అన్నారు. అంతక ముందే వ్యవసాయ శాఖ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీని రైతుబంధు నిధులు బ్యాంకులు జమ చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరడం జరిగిందని ఈ మేరకు మంత్రి తెలియజేశారు. శుక్రవారం వరకు అర్హులైన వారందరికీ రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు.

Related posts