telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా పరీక్షల్లో ఏపీ సర్కారు చర్యలు అద్భుతం: యూకే డిప్యూటీ హైకమిషనర్

cm jagan ycp

కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని హైదరాబాదులో యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. ఇప్పటివరకు ప్రతి 10 లక్షల మందిలో 14,049 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని, 4.5 లక్షల మందితో కూడిన బలమైన వలంటీర్ల వ్యవస్థ, 11,158 మంది గ్రామ కార్యదర్శులు, క్వారంటైన్ చర్యల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న వైనం అమోఘం అని కొనియాడారు.

సీఎం జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రపంచమే పాఠాలు నేర్చుకోవాలంటూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థలో సీఎం జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్న తీరును ప్రస్తుతిస్తూ ప్రచురించిన కథనాన్ని కూడా ఫ్లెమింగ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.

Related posts