*సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై చీటింగ్ కేసు..
*రూ.85 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు..
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. సినిమా తీయడానికి డబ్బులు అవసరమంటూ తన దగ్గర నుంచి రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీంతో ప్రస్తుతం ఈ కేసు టాలీవుడ్‌లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది
సినిమా నిర్మిస్తానంటూ బెల్లంకొండ సురేష్, శ్రీను 2018లో తన వద్ద రూ. 50 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, ఆ తర్వాత గోపీచందర్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా ఉందంటూ చెప్పి మరోసారి రూ. 35 లక్షలు తీసుకున్నారని. తీరా నాలుగేళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ డబ్బు తిరిగి ఇవ్వడం లేదని శరణ్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
దీంతో ఫిర్యాదు స్వీకరించిన నాంపల్లి కోర్టు తండ్రీ, కొడుకులు ఇద్దరిపై కేసు నమోదు చేయాలని సీసీఎస్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.