telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎక్కువగా చెమట పడుతుందా… అయితే ఈ చిట్కాలు పాటించండి !

ఎండాకాలం వచ్చేసింది. రోజు రోజుకు ఎండల తీవ్రత ఎక్కువవుతున్నది. గత కొన్ని రోజుల నుంచి ఎండలు మరింత పెరిగాయి. మరోవైపు ఎండలో తిరుగుతున్న చాలా మంది చల్లగా ఉండడం కోసం శీతల పానీయాలు, ఇతర మార్గాలను అనురిస్తున్నారు. అయితే ఈ ఎండల్లో చాలా మందిని చెమట సమస్య కూడా ఇబ్బంది పెడుతున్నది. ఓ వైపు ఫ్యాన్‌ లేదా కూలర్‌ తిరుగుతూ ఉన్నప్పటికీ చెమట బాగా పడుతున్నది. దీంతో ఏం చేయాలో తెలయక చాలా మంది సతమతమవుతున్నారు. అయితే.. ఈ చిట్కాలు పాటించండి.

చెమట పట్టడం మంచిదే.కానీ కొన్నిసార్లు శరీరానికి అధికంగా చెమట పడుతుంది. పాదాలు, చంకలు, అరచేతుల్లో ఎక్కువగా చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో చాలా ఇబ్బంది పడుతారు.
చెమట పట్టకుండా ఈ నియమాలు పాటించండి :
చల్లని బ్లాక్ టీ మెత్తని గుడ్డ ముంచి తుడవాలి.
బ్లాక్ టీ లో 20 నిమిషాలు చేతులు ఉంచినా ఫలితం ఉంటుంది.
నీటిలో గంధం వేసి.. తర్వాత పేస్ట్ చేసి శరీరానికి రాసుకోవాలి.
అలోవెరా జెల్ రాసినా ఫలితం ఉంటుంది.
అధిక కారం, బాగా వేడిగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించాలి.

Related posts