telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈ-సిగరెట్లపై నిషేధం విధించిన కేంద్రం!

Nirmala seetharaman

దేశంలో ఈ-సిగరెట్ల వాడకాన్ని నిషేధించాలని కేంద్రం నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిప్రకారం ఈ-సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, అమ్మకం, నిల్వ చేయడం, ప్రకటనలు ఇవ్వడాన్ని నిషేధిస్తున్నామని సీతారామన్ చెప్పారు.

పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ-సిగరెట‍్లను ఆశ్రయిస్తున్నారు. ఈ- సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్‌గా మలుస్తారు. వీటిని ఈ-సిగరెట్ల ద్వారా పీల్చడంతో స్మోకర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తూ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

Related posts