telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ సామర్థ్యం బ్రిటన్‌ కే ఉంది…

Corona Virus Vaccine

బ్రిటన్ దగ్గర జూలై చివరినాటికి తన దేశపౌరులైన వయోజనులకు ఇచ్చేందుకు సరిపడా టీకాలు ఉంటాయని… ప్రపంచంలోని 5 కోట్ల మంది ప్రజలకు టీకాలు పంపించే అదనపు సామర్థ్యం బ్రిటన్‌కు ఉందని తెలిపింది ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ సంస్థ యూనిసెఫ్. బ్రిటన్ ఇందుకు సత్వరమే చర్యలు చేపట్టి సంపన్న జీ-7 కూటమి దేశాలకు ఆదర్శంగా నిలవాలని యూనిసెఫ్ పిలుపు ఇచ్చింది. బ్రిటన్‌ను చూసి మిగతా జీ-7 దేశాలు సైతం సాయం కోసం అలమటిస్తున్న ఇతర దేశాలకు టీకాలు పంపించే అవకాశం ఉంటుందని యూనిసెఫ్ అభిప్రాయపడింది. ఇతర దేశాల ప్రజలకు టీకాలు ఇచ్చినప్పుడే కొత్త వైరస్ రకాలు పుట్టుకురాకుండా ఉంటాయని గుర్తు చేసింది. యూనిసెఫ్ ఈ విజ్ఞప్తి చేస్తున్న సమయంలోనే ఫ్రాన్స్ తన దగ్గరున్న టీకా నిల్వల్లో 5 శాతం ఐక్యరాజ్య సమితి పేద దేశాల కోసం చేపట్టే టీకాల కార్యక్రమానికి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించడం విశేషం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దగ్గరున్న అదనపు టీకాలను పేద దేశాలకు పంపించేందుకు అంగీకరించారు. అమెరికా నిల్వల నుంచి 6 కోట్ల ఆస్ట్రజెనెకా డోసులను పంపుతున్నట్టు ఆయన తెలిపారు.

Related posts