telugu navyamedia
రాజకీయ వార్తలు

రాఫెల్ పై కాంగ్రెస్ నేతల వివాదం: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh inaugurates NIA office

దేశానికి రాఫెల్ యుద్ధ విమానాలు వస్తున్న విషయాన్ని స్వాగతించాల్సిందిపోయి, అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నేతలు వివాదం రేపుతున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానంపై తాను ‘ఓం’ అని రాశానని, దానికి ‘రక్షా బంధన్’ కట్టానని తెలిపారు. ఈ రోజు హర్యానాలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేసిన విమర్శలపై స్పందించారు.

దేశంలో కాంగ్రెస్ నేతలు రాఫెల్ విషయంపై వివాదం రేపుతున్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు పాకిస్థాన్ కు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. మన వద్ద ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే, ఉగ్రవాదులపై దాడులు జరపడానికి మనం బాలాకోట్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. అక్కడి ఉగ్రవాద శిబిరాలను మనం ఇక్కడి నుంచే రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా నాశనం చేసే వాళ్లమని రాజ్ నాథ్ తెలిపారు.

Related posts