telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 4 రైల్వే స్టేషన్‌లలో రైలు ప్రయాణీకులకు చవక ధరలో ఆహారo ఆందజేత

తొలుత హైదరాబాద్ , విజయవాడ గుంతకల్లు మరియు రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఈ భోజనాన్ని అందిస్తున్నారు

ఇది ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే రైలు ప్రయాణీకులకు సరసమైన, నాణ్యమైన మరియు పరిశుభ్రమైన ఆహార o (ఎకానమీ మీల్స్ ) ఆందజేత.

రైలు ప్రయాణీకులకు నాణ్యమైన, సరసమైన మరియు పరిశుభ్రమైన భోజనాన్ని అందించే ఉద్దేశంతో  ఎకానమీ మీల్స్  ను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రైలు ప్రయాణీకులకు ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి సరసమైన ధరలో రెండు రకాల భోజనాన్ని ఆందజేస్తారు. మొదటి రకo ఎకానమీ భోజనం రూ. 20/- లకు మరియు రెండవ రకo కాంబో భోజనం రూ. 50/- లకు లభిస్తుంది.

ఈ ఎకానమీ మీల్ రైల్వే స్టేషన్‌లలో ఉన్న ఐ.ఆర్.సీ.టి.సీ (ఇండియన్ రైల్వే టూరిజం మరియు క్యాటరింగ్ సర్వీస్) రిఫ్రెష్‌మెంట్ రూమ్‌ యొక్క కిచెన్ యూనిట్లు మరియు జన్ ఆహార్‌ సర్వీస్ కౌంటర్ల ద్వారా అందించబడుతున్నాయి . జనరల్ కోచ్‌ల సమీపo లో ప్లాట్‌ఫారమ్‌పై ఈ సర్వీస్ కౌంటర్లు ఉంటాయి, తద్వారా అధిక సంఖ్యలో ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. అధీకృత విక్రేతలు సర్వీస్ కౌంటర్ల ద్వారా ప్రయాణీకులకు ఎకానమీ భోజనం విక్రయిస్తారు.

మొదటగా దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణీకులకు ఈ భోజనాన్ని అందించడానికి నాలుగు స్టేషన్లు గుర్తించబడ్డాయి. వీటిలో హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట , గుంతకల్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ కార్యక్రమం ఇప్పటికే జోన్‌లోని మొత్తం 4 స్టేషన్లలో అమ్మకాలను ప్రారంభించింది. రైల్వే మంత్రిత్వ శాఖ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే రైలు ప్రయాణికులకు సరసమైన మరియు నాణ్యమైన
భోజనాన్ని అందించడానికి చొరవను చేపట్టింది. మెనూలో సౌత్ ఇండియన్ ఆహార పధార్దాలు కూడా ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ.అరుణ్ కుమార్ జైన్ ఎకానమీ భోజన సదుపాయం సాధారణ ప్రయాణీకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దీనిద్వారా ప్రయాణికులు నాణ్యమైన మరియు పరిశుభ్రమైన భోజనాన్ని అందుబాటు ధరలో
పొందగలుగుతారు. మొదటగా దక్షిణ మద్య రైల్వేలో 4 స్టేషన్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఐ.ఆర్.సీ.టి.సీ కిచెన్ ద్వారా ఈ భోజనం అందించబడుతుందని ఆయన తెలియజేశారు .

Related posts