telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టెస్ట్ క్రికెట్ చరిత్రలో రికార్డు సృష్టించిన రూట్

భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టులో రెండో రోజు కూడా పూర్తయింది. మొదటి రోజు ఆటలో ఇంగ్లీష్‌ టీమ్‌ కెప్టెన్‌ జో రూట్‌ సెంచరీ చేయడంతో ఆ జట్టు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఇవాళ 263 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట కొనసాగించిన నేడు 555/8 తో పటిష్టమైన స్థితిలో ఉంది. ఇక నేడు అశ్విన్‌ వేసిన 143వ ఓవర్‌లో సిక్సర్‌ తో ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు.‌  అయితే..తాజాగా జో రూట్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన రూట్.. ఆడుతున్న వందో టెస్టులో ద్విశతకం సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న రూట్.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎవరూ సాధించని ఘనత సాధించాడు. అంతేకాదు సిక్సర్‌తో డబుల్ సెంచరీ చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గానూ రూట్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకు కోలిన్‌ చౌదరీ, జావెద్‌ మియాందాద్‌, గార్డెన్‌ గ్రీనిడ్జ్‌, అలెక్‌ స్టివార్ట్‌, ఇంజిమాముల్‌ హాక్‌, రికీ పాటింగ్‌, గ్రేమ్‌ స్మిత్‌, ఆమ్లా తమ వందో టెస్టులో శతకం నమోదు చేయగా.. ఇప్పుడు వారి సరసన రూట్‌ చేరిపోయాడు.

Related posts