telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యార్థుల బస్ పాస్ పరిధి పెంపు

passengers fire on tsrtc buses shortage

ఆంద్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల రాయితీ బస్ పాస్ పరిధి పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బస్ పాస్ పరిధిని 35 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 15 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాలలు దూరంగా ఉన్నాయి. దీంతో, ప్రైవేటు విద్యా సంస్థల బస్సులపై ఆధారపడుతున్న విద్యార్థులకు ఊరట కలిగింది. అంతేకాకుండా, ఆటోలు, ప్రైవేట్ వాహనాలను విద్యార్థులు ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సూచనల మేరకు రాయితీ బస్ పాస్ ల పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాయితీ బస్ పాస్ పరిధి పెంపు కారణంగా ప్రభుత్వంపై ఏటా రూ.18.5 కోట్ల అదనపు భారం పడుతుందని .అధికారులు అంచనా వేశారు.

Related posts