telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టెస్టులో గంభీర్ కు నెగెటివ్…

gambhir fire on selection board on rayudu

ప్రస్తుతం భారత్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. దేశంలో ఇప్పటికే 84 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్నది. ఢిల్లీ రాష్ట్రములో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు వరకు అందరూ కూడా కరోనావైరస్ బారిన పడుతున్నారు. తాజాగా మాజీ క్రికెట‌ర్, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ గౌతం గంభీర్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. గంభీర్ నివాసంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్న‌ట్లు ఆయ‌న ట్వీట్ వేదికగా వెల్లడించారు. గంభీర్ నివాస భవనంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు ట్వీట్ చేసి వెల్లడించారు. ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, ఎవ‌రూ కూడా తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని గంభీర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇక తాజాగా తనకు కరోనా నెగెటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ట్విట్టర్ లో ”నా కరోనా పరీక్ష ఫలితం నెగెటివ్ అని వచ్చింది. నేను ప్రతి ఒక్కరినీ మళ్ళీ కోరుతున్నాను. అందరూ కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటున్నాను” అని గంభీర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.

Related posts