telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నేటినుండే ఏపీలో పర్యటించనున్న కేంద్ర బృందాలు…

ఆంధ్ర ప్రదేశ్ లో నేటినుండి కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టంపై ఆరా తీయనున్నాయి. ఓ బృందం రేపు కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనుంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట నష్టంపై వివరాలు సేకరించనుంది. ఇటు అగ్రికల్చర్ అధికారులతో సమావేశమయ్యి సమాచారం అడిగి తెలుసుకోనుంది. ఇక ఎల్లుండి మరో బృందం ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తుంది. మొత్తం మూడు బృందాలు ఏపీకి వస్తున్నాయి. ఇక వరద నష్ట అంచనాలను ఏపీ సర్కార్‌ ఇప్పటికే సిద్ధం చేసింది. 186  మండలాల్లో  వరద ప్రభావం ఉందంటోంది ప్రభుత్వం. దాదాపు 885  గ్రామాలు నీటమునిగినట్లు తేలింది. 35 వేల ఇళ్లు మునిగిపోగా…   1700కి పైగా ధ్వంసం అయ్యాయి. సుమారు 15 వందల కోట్లకు పైగా  నష్టం జరిగినట్టు అంచనా వేశారు. శాఖల వారీగా వివరాలు చూస్తే…  ఆర్‌ అండ్‌ బీ శాఖకు 13 వందల కోట్లు.. ఇరిగేషన్‌కు 33 కోట్లు,  మున్సిపల్‌ శాఖకు 23 కోట్లు, పంచాయతీ రాజ్‌కు 160 కోట్ల లెక్కన  నష్టం జరిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అలాగే మొత్తం  రెండు లక్షల 38 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 34 వేల  ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. విశాఖ, కృష్ణా,  కర్నూలు జిల్లాల్లో సుమారు 142 కోట్ల రూపాయల పట్ట నష్టం  జరిగింది. ఆక్వా విషయానికి వస్తే గోదావరి జిల్లాల్లో 7 వేల 400  ఎకరాల్లోని ఆక్వా కల్చర్‌ సర్వ నాశనం అయిందని ఏపీ సర్కార్ తెలిపింది. 

Related posts